గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 మే 2024 (11:42 IST)

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

fire
హర్యానాలోని నుహ్ జిల్లాలోని టౌరు సమీపంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఇంకా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన కుండ్లీ-మనేసర్-పాల్వాల్ (కేఎంపీ)లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది.
 
బస్సులో దాదాపు 60 మంది ప్రయాణిస్తున్నారని, వీరంతా పంజాబ్, చండీగఢ్ నివాసితులని, మధుర-బృందావన్ నుండి తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు బస్సును వెంబడించి డ్రైవర్‌ను ఆపాలని కోరారు. వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు కూడా సమాచారం అందించారు. 
 
అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు