సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:05 IST)

దేశంలో మరో ఈటా వైరస్.. కర్నాటకలో తొలి కేసు

దేశంలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ పేరు ఈటా. కర్నాటకలో తొలి కేసు నమోదైంది. కరోనా వైరస్ జన్యుమార్పిడి చెందడంతో ఈ వైరస్ అవతరించినట్టుగా గుర్తించారు. భారత్‌లో తొలిసారి గుర్తించిన డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలకు విస్తరించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుండగా, బ్రిటన్ దేశంలో తొలిసారి గుర్తించిన 'ఈటా వేరియంట్' తాజాగా మన దేశంలోకి కూడా ప్రవేశించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కర్నాటకలోని మంగళూరుకు చెందిన ఈ వ్యక్తిలో ఈ కొత్త రకం వేరియంట్ గుర్తించారు. 
 
ఈయన నాలుగు నెలల కిందట దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లా మంగుళూరులోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు వివరించారు. కరోనా లక్షణాలు బయటపడటంతో నిర్ధారణ పరీక్షలో కోవిడ్ పాజిటివ్‌గా వచ్చిందని వివరించారు.
 
చికిత్స అనంతరం అతడు కరోనా నుంచి కొద్ది రోజుల తర్వాత కోలుకున్నట్లు చెప్పారు. అతడితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
 
జన్యు విశ్లేషణ పరిశోధనలో భాగంగా అతడి రక్త నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపామని, ఆ వ్యక్తిలో కొత్త రకం ఈటా వేరియంట్ బయటపడినట్లు చెప్పారు.