శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జనవరి 2024 (20:07 IST)

కేవైసీ అప్‌‍డేట్ చేయకుంటే డీయాక్టివేట్ : ఎన్.హెచ్.ఏ.ఐ

fastag
ఫాస్టాగ్ విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. నో యువర్ కస్టమర్ (కేవైసీ)ని పూర్తి చేయని ఫాస్టాగ్‌లును పూర్తిగా బ్లాక్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 31వ తేదీలోగా కేవైసీ అప్‌‍డేట్ చేయని ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేయనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 
 
కేవైసీ పూర్తి చేయకుంటే ఫాస్టాగ్ బ్యాలెన్స్ ఉన్నా వాటిని బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని, ఈ అసౌకర్యాన్ని నివారించుకోవాలంటే యూజర్లు వెంటనే కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎన్.హెచ్.ఏ.ఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం సమీపంలోని టోల్ ప్లాజా లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని సూచించింది. 
 
వాహనదారులు కొన్నిసార్లు ఫాస్టాగ్‌లను వాహనం ముందు పెట్టకుండా ఇష్టానుసారంగా పెడుతున్నారని... దాంతో టోల్ ప్లాజాలలో ఆలస్యం కావడంతో పాటు అందరినీ అసౌకర్యానికి గురిచేస్తోందని పేర్కొంది. వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు... ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని... ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని సూచించింది.