శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (07:55 IST)

కేవలం 3 నిమిషాలలోనే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌

అతి తక్కువ సమయంలోనే ఆన్ లైన్ పేమెంట్ లో విజృంభించిన సంస్థగా పేటి‌ఎం మార్కెట్లో గొప్ప పేరు సంపాదించుకుంది. అయితే పేటి‌ఎం ఇప్పుడు మరో విజయాన్ని సాధించింది.

పేటీఎం ఇప్పటివరకు మూడు మిలియన్ల ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేసి భారతదేశంలో ఫాస్ట్‌టాగ్ జారీ చేసిన అతిపెద్ద సంస్థగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పిపిబి) సోమవారం ప్రకటించింది. అలాగే టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ పేమెంట్లను వేగవంతం చేసింది.
 
"ఈ విజయం మేము 'డిజిటల్ ఇండియా'ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనం. దేశంలో డిజిటల్ టోల్ పేమెంట్లను చేయడానికి మేము మరింత కృషి చేస్తాము" అని పేటిఎం ఎండి, సిఇఒ సతీష్ గుప్తా  ఒక ప్రకటనలో తెలిపారు.ఫాస్ట్ ట్యాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టం, దీనిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. 
 
ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ పేమెంట్ చేయడానికి ప్రీపెయిడ్ లేదా సేవింగ్ అక్కౌంట్ నేరుగా  టోల్ యజమానికి   టోల్ చార్జ్ ట్రాన్సఫర్ అవుతాయి.   పేటి‌ఎం పేమెంట్స్ బ్యాంక్ మార్చి నాటికి ఐదు మిలియన్ల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ జారీలని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక నెలలో 40 శాతానికి పైగా ఫాస్ట్‌ట్యాగ్‌లను  జారీ చేసింది.
 
పేటి‌ఎం ఫాస్ట్ ట్యాగ్ కోసం పేటి‌ఎం వాలెట్‌ నుండి  డైరెక్ట్ గా చెల్లించొచ్చు. ఇందుకోసం రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులు వారి పేటి‌ఎం వాలెట్ నుండి నేరుగా పేమెంట్ చేయడానికి అనుమతిస్తుంది.ఇది వాహన రిజిస్ట్రేషన్ నంబర్, సర్టిఫికేట్ వంటి డాక్యుమెంటేషన్‌తో కొనుగోలు చేయవచ్చు. రిజిస్టర్డ్ అడ్రస్‌కి ఉచితంగా పంపిస్తారు.
 
పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఇటిసి) ప్రోగ్రామ్లలో భారతదేశంలో రెండవ అతిపెద్ద కొనుగోలు బ్యాంకు, ఇది దేశవ్యాప్తంగా అన్నీ టోల్ చెల్లింపుల సేవలను అందిస్తుంది.పేటి‌ఎం ఫాస్‌టాగ్ భారతదేశం అంతటా 110 టోల్ ప్లాజాలలో ఆటోమేటిక్ కాష్ లెస్ పేమెంట్ సేవలను అందిస్తోంది. ఇది హైవే ప్రయాణాలలో టోల్ వద్ద ఇబ్బందులు కలగకుండా చేస్తుంది.
 
దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 10వేల మంది వ్యాపార కరస్పాండెంట్లను నియమించడం ద్వారా ఇది ఫాస్ట్ ట్యాగ్ ల అమ్మకాలను పెంచుతోంది.

కాష్ లెస్ పేమెంట్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వాణిజ్య వాహన యజమానులకు ట్యాగ్‌లను కొనుగోలు చేయడానికి సహాయపడటానికి, పేటీఎం చెల్లింపుల బ్యాంక్ భారతదేశం అంతటా అన్నీ టోల్ ప్లాజాలలో 300కి పైగా శిబిరాలను ఏర్పాటు చేసింది.పిపిబి ప్రస్తుతం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఇటిసి) మార్కెట్లో అగ్రగామిగా ఉంది.