సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (10:59 IST)

మీ 'పద్మ' పురస్కారం నాకొద్దు : బుద్ధదేవ్ భట్టాచార్య

భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీరిరో వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఒకరు. అయితే, ఈయన ఈ పురస్కారాన్ని తిరస్కరించారు. ఈ అవార్డు గురించి తనను ఎవరూ సంప్రదించలేదని, ఎవరూ చెప్పలేదని చెప్పారు. ముందుగా సంప్రదించివుంటే ఖచ్చితంగా ఈ పురస్కారం వద్దని చెప్పేవాడనని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. 
 
అయితే, కేంద్ర ప్రభుత్వం వాదన మరోలావుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి మంగళవారం ఉదయం ఈ అవార్డు విషయమై భట్టాచార్య భార్యతో మాట్లాడినట్టు తెలిపింది. ఇందుకు ఆమె అంగీకరించారని, పౌర పురస్కారానికి ఎంపిక చేసినందుకు హోంమంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు కూడా తెలిపారని హోంశాఖ వివరణ ఇచ్చింది. 
 
కాగా, 77 యేళ్ళ బుద్ధదేవ్ భట్టాచార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిజానికి పద్మపురస్కారాలను తిరస్కరించడం చాలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే వాటిని ప్రకటించడానికి ముందుగానే ఎంపిక చేసిన అవార్డు గ్రహీతల అంగీకారాన్ని తెలుసుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కూడా పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు.