శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (11:04 IST)

ఢిల్లీలో ఘోరం.. డ్రగ్స్ కలిపిన టీ.. అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక

victim girl
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలో 14 ఏళ్ల మైనర్ బాలికపై అకృత్యం జరిగింది. దొంగతనం నేరాన్ని మోపిన 48 ఏళ్ల బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ బెదిరించి అత్యాచారానికి పాల్పడి 14 ఏళ్ల బాలికను తల్లిని చేశాడు. నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని ఓ ప్రాంతానికి చెందిన బాధితురాలు కూల్ డ్రింక్స్ కోసం తరచుగా బాధితుడి దుకాణానికి వెళ్లేది.  గత ఏడాది ఒక రోజు అమ్మాయి ఆ దుకాణానికి వెళ్లినప్పుడు, నిందితుడు ఆమెపై దొంగతనం నేరం మోపాడు.  ఫోన్ దొంగిలించావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. బాలిక భయపడడంతో అవకాశంగా తీసుకున్నాడు. 
 
బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లి డ్రగ్స్ కలిపిన టీ తాగించాడు. బాధితురాలిని ఇంటికి తీసుకెళ్లి డ్రగ్స్ కలిపిన టీ తాగించాడు. ఆ తర్వాత బాలిక స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఆ ఘటనను వీడియో తీశాడు. 
 
ఆ తర్వాత తరచుగా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. తాజాగా ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.