శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (08:12 IST)

రెండు నెలల్లోనే రేప్ కేసుల్లో దర్యాప్తు

మైనర్లపై జరిగిన రేప్ కేసుల్లో రెండు నెలల్లోనే దర్యాప్తు పూర్తి కావాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు.

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయ శాఖలో అన్ని స్థాయిల్లో తీసుకోవాల్సిన చర్యలపై డైరక్షన్ ఇస్తామని చెప్పారు. అలాగే మైనర్ల రేప్ కేసుల్లో రెండు నెలల్లోనే దర్యాప్తు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాస్తానన్నారు కేంద్ర మంత్రి.
 
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అందులో ఇప్పటికే 704 కోర్టులు వర్క్ అవుతున్నాయని, మిగిలినవి త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు.
 
'సత్వర న్యాయం కోసం.. శిక్షాస్మృతిలో మార్పులు తెస్తాం'
సత్వర న్యాయం కోసం ఐపీసీ, సీఆర్​పీసీ శిక్షాస్మృతిలో మార్పులు తేవాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్​షా తెలిపారు. అత్యాచరాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఈ మార్పులు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ఐపీసీ, సీఆర్​పీసీ శిక్షాస్మృతిలో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

అత్యాచారం వంటి ఘోరమైన నేరాల్లో న్యాయం వేగంగా జరిగేలా ప్రకియలో మార్పులు తెస్తామని ఆయన స్పష్టం చేశారు. సలహాలు ఇవ్వండి.. ఐపీసీ, సీఆర్​సీపీ శిక్షాస్మృతుల సమగ్ర పరిశీలనకు సలహాలు పంపాలని కేంద్ర హోంశాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలను కోరింది.

మహారాష్ట్రలోని పుణెలో నిర్వహించిన డీజీపీ, ఐజీ 54 వార్షిక సదస్సులో పాల్గొన్న షా.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శిక్షాస్మృతుల్లో మార్పులు తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని వెల్లడించారు. రాష్ట్రాల్లో అఖిల భారత పోలీస్‌ విశ్వవిద్యాలయం, అఖిల భారత ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుందని అమిత్‌ షా వెల్లడించారు.

దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరును ప్రశంసించిన షా.. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ పోలీస్‌ స్టేషన్లకు హోంమంత్రి ట్రోఫీలను బహూకరించారు.