గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 అక్టోబరు 2020 (10:20 IST)

సైన్యంలో చీలికలు.. పాకిస్థాన్‌పై ఫైర్ అయిన భారత్

భారత సైన్యంలో చీలికలు తెచ్చేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం సాగుతోంది. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలకు హద్దే లేకుండా పోతోంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ సీనియర్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ తరన్‌జిత్ సింగ్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
మతం ఆధారంగా భారతదేశంలో వైరుద్ధ్యాలు సృష్టించేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నిస్సహాయంగా మారిన పాక్‌... భారత సైన్యంలో విభజన సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
 
మరోవైపు పాకిస్థాన్ తాను చేసిన తప్పులను ఒప్పుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ గురించి మాట్లాడింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ విషయంలో పాకిస్థాన్ నాయకత్వం గతంలో తప్పులు చేసిందని, ఆ తప్పులను పునరావృతం కానివ్వబోమని తెలిపింది. 
 
ఆఫ్ఘనిస్థాన్ హై కౌన్సిల్ ఫర్ రీకన్సిలియేషన్ (హెచ్‌సీఎన్ఆర్) చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిథి బృందం పాకిస్థాన్ నేతలను కలిసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ పశ్చాత్తాప వచనాలు వినిపించాయి.