గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (09:44 IST)

మైనర్ బాలికను తల్లిని చేసిన వృద్దుడు.. 23 యేళ్ల జైలు

jail
తమిళనాడు రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. 13 యేళ్ల మైనర్ బాలికను 76 యేళ్ల వృద్ధుడు తల్లిని చేశాడు. దీంతో ఆయనకు వేలూరు జిల్లా ప్రత్యేక కోర్టు 23 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాకు చెందిన 76 యేళ్ల అన్వర్ బాషా అనే వ్యక్తి అల్యూమినియం పాత్రల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాణిపేట జిల్లా కీళవిశారం పిళ్ళయార్ వీధి నివాసి. తన గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు వెళుతూ వ్యాపారం చేసేవాడు. 
 
ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన 13 యేళ్ల బాలిక బాషాకు పరిచయం కాగా, ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఓ రోజున ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అత్యాచార పర్వం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆ బాలిక గర్భందాల్చి ఇంటిలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
దీనిపై బాధిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు బాషాను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ వేలూరు జిల్లా ప్రత్యేక కోర్టులో సాగగా, ముద్దాయిగా తేలిన అన్వర్ బాషాకు బాలికను కిడ్నాప్ చేసినందుకు మూడేళ్లు, ఫోక్సో చట్టం కింద 20 యేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.10 లక్షల అపరాధం కూడా విధించింది.