శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 30 మే 2019 (19:12 IST)

"నమో 2.O" : ప్రధాని పీఠంపై రెండోసారి చాయ్‌వాలా... మోడీ మంత్రివర్గంలో తెలుగుబిడ్డ

హస్తినలో వరుసగా రెండోసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మోడీతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ., యూపీఏ ఛైర్‌పర్స్ సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి అగ్రనేతలు, సెలబ్రెటీలు హజరయ్యారు. 
 
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఆయన మంత్రివర్గ సహచరులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా పార్టీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్, ఆ తర్వాత అమిత్ షాలు ప్రమాణం చేయగా, ఆ తర్వాత సదానంద గౌడ, నిర్మలా సీతారామన్‌లతో పాటు ఇతరులు వరుసగా ప్రమాణం చేశారు. 
 
మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించినవారిలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, అర్జున్ రామ్, మేఘ్వాల్, ప్రకాష్ జావదేకర్, రాందాస్ అథవాలే, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, బుబుల్ సుప్రియో, సురేష్ అంగడి, జితేంద్ర సింగ్, పియూష్ గోయల్, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, ప్రహ్లాద్ పటేల్, రవీంద్రనాథ్, పురుషోత్తమ్ రూపాల, సంజీవ్ బలియాన్, ఆర్పీసింగ్, నిత్యానంద్ రాయ్, తాపర్ చంద్ గెహ్లాట్ తదితరులు ఉన్నారు.