సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జనవరి 2021 (10:00 IST)

న్యూఢిల్లీలో కనిష్టానికి పడిపోయిన పగటి ఉష్ణోగ్రత

ఉత్తర భారతం చలికి గజగజ వణికిపోతోంది. ముఖ్యంగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతున్నాయి. గత దశాబ్దన్నర కాలంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రత నమోదైంది.శనివారం సఫ్దర్ గంజ్ లాబొరేటరీ 1.1 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసింది. 
 
2006, జనవరి 8న 0.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత ఇంత తక్కువ వేడిమి నమోదుకావడం ఇదే తొలిసారి. గత సంవత్సరం జనవరిలో 2.4 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయిందని ఐఎండీ (ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్) అధిపతి కులదీప్ శ్రీవాత్సవ గుర్తుచేశారు.
 
కాగా, పొగమంచు కారణంగా విజబిలిటీ శూన్యమైందని తెలిపిన ఆయన, కనీసం 50 మీటర్ల దూరంలోని వాహనాలను సైతం చూసే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులు ఉష్ణోగ్రతను కనిష్ణానికి చేర్చాయని, ఈ పరిస్థితి 6వ తారీకు వరకూ ఉంటుందని ఆ తర్వాత ఉష్ణోగ్రత 8 డిగ్రీల వరకూ పెరగవచ్చని అంచనా వేశారు. వేడి పెరిగినా, చలి తీవ్రత మాత్రం కొనసాగుతుందని తెలిపారు.