గురువారం, 8 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 27 మే 2023 (10:16 IST)

జీవిత భాగస్వామితో శృంగారం నిరాకరించడం క్రూరత్వమే.. అలహాబాద్ కోర్టు

romance
అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామితో శృంగారం నిరాకరించడం క్రూరత్వమేనని కోర్టు పేర్కొంది. తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామికి ఎక్కువ కాలం శృంగారాన్ని నిరాకరించడం మానసిక క్రూరత్వమని కోర్టు పేర్కొంది. 
 
ఫ్యామిలీ కోర్టు తన విడాకుల పిటిషన్‌‌‌‌ను కొట్టివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి చేసిన అప్పీల్‌‌‌‌ను గురువారం జడ్జిలు జస్టిస్ సునీత్ కుమార్, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన బెంచ్​ విచారించింది. ఈ కేసులో భార్యాభర్తలిద్దరూ చాలాకాలం పాటు విడిగా నివసిస్తున్నట్లు స్పష్టమైంది. 
 
భార్య వైవాహిక బంధం పట్ల గౌరవం, వైవాహిక బాధ్యతను నిరాకరించింది. దీంతో వారి వివాహ బంధం తెగిపోయిందని కోర్టు వెల్లడించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుపై అప్పీల్‌ను విచారించిన బెంచ్​​ ఈ మేరకు భర్తకు విడాకుల డిక్రీని మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.