ప్రధాని మోడీ సోదరుడికి కిడ్నీ సమస్య - చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈయన కిడ్నీ సంబంధిత సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. దీనికి చికిత్స చేయించుకునేందుకు చెన్నైకు రాగా, ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు.
ఇటీవల ప్రహ్లాద్ మోడీ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, మదురై, రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన చెన్నై ఆస్పత్రిలో చేరారు.
తాగా హీరాబెన్, దామోదర్ దాస్ ముల్‌చంద్ మోడీలకు ఈయన నాలుగో సంతానం. అహ్మదాబాద్‌లో ఓ కిరాణ, టైర్ షోరూమ్‌ను నడుపుతున్నారు. గత యేడాది డిసెంబరు నెలలో కర్నాటక రాష్ట్రంలోని మైసూరు పర్యటనలో ఉన్నపుడు ఆయన కారు ప్రమాదానికి గురైంది. తన కుటుంబ సభ్యులతో కలిసి బందీపూర్ నుంచి మైసూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.