శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (13:29 IST)

బాలికపై సామూహిక అత్యాచారం.. రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి..?

బాలికపై పోలీసులే అకృత్యానికి పాల్పడ్డారు. ఓ బాలికపై మూడు నెలలు పోలీస్ స్టేషన్‌లో సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. లాక్‌డౌన్ వల్ల ఇంటికి వెళ్లలేక దిక్కులు చూస్తున్న బాలికకు సాయం చేస్తామని చెప్పి అత్యాచారకాండ సాగించారు. 
 
మూడునెలలు అమ్మాయికి నరకం చూపించారు. ఈ క్రమంలో బాధితురాలికి గర్భం రావడంతో అబార్షన్ చేయించి, ఎవరికీ చెప్పొద్దంటూ రెండువేలు చేతిలో పెట్టి పంపారు. ఈ ఘటన ఒడిశాలోని సుందర్ గడ్‌ జిల్లాలోని బీరమిత్రపూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..13 ఏళ్ల బాలిక రోడ్డుపై ఒంటరిగా కనిపించడంతో బీరమిత్రపూర్ పోలీసులు ఆమె స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝి అత్యాచారం చేశాడు. తర్వాత ఆమె బెదిరించి ఇంట్లో వదిలేశారు. 
 
రోజూ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. బాలిక పెంపుడు తండ్రి భయపడిపోయి అమ్మాయిని అలాగే చేయాలన్నాడు. బాధితురాలు ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. మూడు నెలల పాటు స్టేషన్ సిబ్బంది వంతుల వారీగా ఆమెపై ఘోరానికి పాల్పడ్డారు. ఇంకా నిందితులైన పోలీసులను సస్పెండ్ చేశారు. 
 
విషయం తెలుసుకున్న మరో ఇద్దరు యువకులు కూడా కాటేశారు. అనారోగ్యం పాలైన బాలికను ఈ నెల 16 ఆస్పత్రికి తరలించగా గర్భం దాల్చినట్లు తేలింది. పోలీసులు డాక్టర్లను బెదిరించి గర్భస్రావం చేయించారు. మహిళా సంక్షేమ సంఘం జోక్యంతో ఈ ఘటనపై కేసు నమోదైంది.