గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:27 IST)

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. రాజీనామా చేసిన అశోక్‌ లావాసా స్థానంలో రాజీవ్‌ కుమార్‌ నియామకం జరిగింది.

ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్‌ కుమార్‌ జార్ఖండ్‌ కేడర్‌ 1984 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. పబ్లిక్‌ పాలసీ, వివిధ రంగాల్లో పాలనకు సంబంధించి కుమార్‌కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.