శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (17:06 IST)

పాము కాటేసింది.. రాత్రిపూట నాటు వైద్యం.. తెల్లారేసరికి?

Snake
పాముకాటుకు ఓ గిరిజన మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మందస మండలంలోని గిరిజన ప్రాంతమైన బసవసాయి గ్రామానికి చెందిన సవర సుజాత(30) పాముకాటుకు బలైంది. ఆమె ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో ఇంటిలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో కట్లపాము ఇంటిలో దూరి సుజాతను కాటేసింది. సుజాత కేకలు వేయడంతో కుటుంబసభ్యులు పాముకాటును గుర్తించారు. చుట్టుపక్కల వారు వచ్చి పామును చంపేశారు.
 
రాత్రి సమయం కావడంతో నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. దీని వల్ల సమయం వృథా అయ్యింది. పరిస్థితి విషమించడంతో 108కు సమాచారం అందించారు. 
 
సోమవారం ఉదయం ఐదు గంట ల సమయంలో 108 వాహనంలో ఆమెను పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.