ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (14:25 IST)

ఎన్నికల ప్రచారం అక్కర్లేదు.. ఇంట్లో కూర్చోండి.. "గాలి"కి సుప్రీంకోర్టు షాక్

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన సోదరుడు సోమశేఖర రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన చేసిన వినతిని సుప్రీంక

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన సోదరుడు సోమశేఖర రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
 
తన సోదరుడు సోమశేఖర్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని.. అతని తరపున ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని గాలి జనార్ధన్‌ రెడ్డి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం... గాలి జనార్ధన్‌ రెడ్డి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. 
 
గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్‌పై విడుదలై ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, అందువల్ల ఎన్నికల వేళ బళ్లారిలో పర్యటించకూడదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. బళ్లారిలో పర్యటించేందుకు అనుమతి కోరుతూ గాలి జనార్ధన్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా, ఈనెల 12వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, 15వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.