శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (16:57 IST)

సిద్ధరామయ్య ఇంట విషాదం: సోదరి శివమ్మ భర్త మృతి

Siddaramaiah
కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట విషాదం నెలకొంది. సిద్ధరామయ్య సోదరి శివమ్మ భర్త రామేగౌడ కన్నుమూశారు. 
 
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరుగలేని విజయం దిశగా దూసుకుపోతున్న తరుణంలో ఎంతో హుషారుగా సందడి చేయాల్సిన తరుణంలో సిద్ధరామయ్య ఇంట విషాదం నెలకొంది. శనివారం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన రామేగౌడ.. చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. 
 
కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్‌ ప్రభంజనం సృష్టిస్తుందని కర్ణాటక మాజీ సీఎం అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 130 సీట్లకు పైగా సీట్లతో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు.