సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

నీట్ యూజీ ఫలితాలపై గందరగోళం... క్లారిటీ ఇచ్చిన కేంద్ర విద్యాశాఖ

neet exam
జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 ఫలితాలపై అయోమయం నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సవరించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసిందంటూ ఓ వార్త హల్చల్ చేసింది. పైగా, ఈ ఫలితాలకు సంబంధించిన ఓ లింకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లింకును క్లిక్ చేసినవారికి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఏ వెబ్‌సైట్‌లో ఉన్నది పాత లింకు అని, ఆ లింకు చూసి స్కోర్ కార్డులు ప్రకటించనట్టుగా భావించారని తెలిపింది. సవరించిన స్కోరు కార్డులు ఇంకా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. త్వరలోనే ఫలితాలపై అధికారిక ప్రకటన ఉంటుందని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. 
 
హైదరాబాద్ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు పలు రైళ్ళు రద్దు 
 
హైదరాబాద్ డివిజన్ పరిధిలో వివిధ పనుల కారణంగా నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే, దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, గుంతకల్ - బీదర్ (07671) ఆగస్టు 1-31 వరకు, బోధన్ - కాచిగూడ (07275) ఆగస్టు 2-సెప్టెంబర్ 1, కాచిగూడ - గుంతకల్ (07670) ఆగస్టు 2-సెప్టెంబర్ 1, కాచిగూడ - రాయచూర్ (17693) ఆగస్టు 1-31, రాయచూర్ - గద్వాల్ (07495) ఆగస్టు 1-31, గద్వాల్ - రాయచూర్ (07495) ఆగస్టు 1-31, రాయచూర్ - కాచిగూడ (17694) ఆగస్టు 1-31, కాచిగూడ - నిజామాబాద్ (07596) ఆగస్టు 1-31, నిజామాబాద్ - కాచిగూడ (07593) ఆగస్టు 1-31, మేడ్చల్ - లింగంపల్లి (47222) ఆగస్టు 1-31, లింగంపల్లి - మేడ్చల్ (47225) ఆగస్టు 1-31, మేడ్చల్ - సికింద్రాబాద్ (47235) ఆగస్టు 1-31, సికింద్రాబాద్ - మేడ్చల్ (47236) ఆగస్టు 1-31, మేడ్చల్ - సికింద్రాబాద్ (47237) ఆగస్టు 1-31, సికింద్రాబాద్ - మేడ్చల్ (47238) ఆగస్టు 1-31, మేడ్చల్ - సికింద్రాబాద్ (47242) ఆగస్టు 1-31, సికింద్రాబాద్ - మేడ్చల్ (47245) ఆగస్టు 1-31 వరకు రద్దయ్యాయి.