ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (15:01 IST)

నవరాత్రులలో దుర్గాదేవి దర్శనం..?

పార్వతీ దేవీ మహా పవిత్రమైన వారు. ఈ నవరాత్రులతో అమ్మవారికి సకల పూజలు అందిస్తారు. ఈ దశమి నవరాత్రులతో అమ్మవారిని దర్శించుకుంటే సర్వో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు (18-10-2018) దుర్గాదేవిని ఈ మంత్రంతో జపిస్తే ధైర్యంతో పాటు విజయాలు చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి.
 
''అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే''
 
నవరాత్రులతో గురువారం నాడు ఈ మంత్రంతో అమ్మవారిని ఆరాధించే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ నాడే దుర్గాదేవి దుష్టుడైనా మహిషాసురుని చంపి అందరి కష్టాలను తొలగించింది. అమ్మవారు ఈ రోజూ చాలా శక్తివంతంగా ఉంటారు. ఇదే రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు ఈ మంత్రాన్ని స్మరిస్తూ దుర్గాదేవిని పూజిస్తే అరిషడ్వర్గాలు జయించగలుగుతారని చెప్తున్నారు.