తానా మహాసభలలో పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ విభాగం...

TANA kids committee
ivr| Last Modified మంగళవారం, 23 జూన్ 2015 (17:54 IST)
జూలై నెలలో 2-4వ తేదీల్లో డిట్రాయిట్లో జరుగనున్ను 20వ TANA మహాసభలను పురస్కరించుకుని శ్రీ గంగాధర్ నాదెళ్ళ మరియు శ్రీ మోహన్ నన్నపనేని ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ చాలా చురుకుగా సాగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరుగతనున్న ఈ మహాసభలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, అమెరికా, భారత్ నుండి ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, నవలా రచయితలు, వేదపండితులు, అష్టావధాన, శతావధాన దిగ్గజాలు, ప్రముఖ తెలుగు పండితులు, తెలుగు కవులు , ప్రముఖ పాత్రికేయులు కళాకారులు మరియు దాతలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
తానా కార్యవర్గం, ఈ సభలను జయప్రదం చేయడానికి వివిధ కమిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదించి తగిన సూచనలను అందచేస్తున్నారు. ఈ సమావేశాలకు చిన్నపిల్లలతో హాజరవుతున్న వారి సౌకర్యార్ధం KIDS Activity Committee ప్రణాళికను రూపొందిస్తోంది. రెండు సంవత్సరాల వయసుకు మించిన పిల్లలకు అతితక్కువ రుసుముతో వారిని అలరించే వివిధ కార్యకలాపాలతో బేబి సిట్టింగ్‌ను ఏర్పాటుచేస్తోంది.
 
ఈ కార్యక్రమం సర్టిఫయిడ్ బేబిసిట్టర్స్‌తో నిర్వహించబడుతుంది. పిల్లలను వారు ఆహ్లాదించే కార్యక్రమాలలో వదిలి వారి తల్లిదండ్రులు సమావేశాలను ఆస్వాదించేలా చెయ్యడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మరిన్ని వివరాలకు tana2015.org సంప్రదించండి.
 
చిన్నపిల్లల బేబిసిట్టింగ్ వివరాలు:  
జూలై 2, 2015 – గురువారం సాయంత్రం 5 గంటలు నుండి 11 గంటల వరకు
$5 ఫ్లాట్ రేట్. 2 సంవత్సరాల వయస్సు పైబడిన పిల్లలకి మాత్రమే ఈ సదుపాయం
జూలై 3, & జూలై 4 – శుక్ర, శనివారాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
నామమాత్రపు రుసుము $3 గంటకు
పిల్లలకి పసందైన ఆటలతో వినోదాన్ని అందిస్తారు.  2 సంవత్సరాల వయస్సు పైన పిల్లలకి మాత్రమే ఈ సదుపాయం
సమావేశాలకు హాజరవుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. ఆలాగే మీ స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఈ వివరాలను అందజేయవలసినదిగా కోరుతున్నాము.దీనిపై మరింత చదవండి :