శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 27 జూన్ 2015 (13:45 IST)

ఒక్క మాటలో చెప్పండి... 20వ తానా సభలకు ఎందుకు రావాలి...? కోశాధికారితో ముఖాముఖి

20వ తానా సభలు డెట్రాయిట్లో ప్రతిష్టాత్మాకంగా నిర్వహించబోతున్నారు కదా.. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన నిధుల సేకరణ ఎప్పుడు ప్రారంభమైంది? ఆ సేకరణలో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏమైనా ఉన్నాయా?
 
నిధుల సేకరణ 2014 అక్టోబర్ నెలలో డెట్రాయిట్ నందు జరిగిన kick off fund raiserతో మొదలైంది. అందులో రికార్డు స్థాయిలో 1.60 మిలియన్ డాలర్స్ విరాళాలు దాతలు ప్రకటించారు. వాటి వసూళ్ళు అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. తదుపరి వివిధ నగరాలలో తానా నాయకత్వంలో విరాళాల సేకరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇబ్బందులేవీ లేవు.

ముఖ్యంగా ఈ చక్కటి పరిస్థితికి తానాను అభిమానించే స్వచ్ఛంద దాతల వితరణ, అధినాయకత్వం యొక్క సహకారం ముఖ్యంగా కో-ఆర్డినేటర్ నాదెళ్ళ గంగాధర్, ప్రెసిడెంట్ నన్నపనేని మోహన్, సెక్రటరీ గోగినేని శ్రీనివాస తదితరుల సహకారం మిక్కిలిగా ఉపయోగపడింది.
 
ఒకప్పటి తానా సభలకు, ప్రస్తుతం జరుగుతున్న తానా సభలకు చాలా వ్యత్యాసం ఉంది కదా.. సాంకేతికత అనేది ఈ కార్యక్రమాల్లో ఒక భాగమైంది. రకరకాల ప్రసార మాధ్యమాలు వచ్చాయి. వీటి కొరకు Separate budget లాంటిది ఏమైనా కేటాయించారా? 
ఇంతకుముందు లానే ఆడియో విజువల్, మీడియా, IT వగైరాలకు ఎక్కువ మొత్తoలో నిధులు కేటాయింపు జరిగిన మాట వాస్తవమే, కానీ వీటి వలన ప్రచారంలో నాణ్యత  పెరగాడమే కాకుండా ఈ సమావేశాలకు ఆధునికత రావడంతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రచారం వచ్చింది.  మొదటిసారి మొబైల్ ఆప్ కూడా ఏర్పాటు చెయ్యబడింది.  
 
వివిధ కమిటీలు మీ వద్దకు రకరకాల అభ్యర్థనలు తీసుకొస్తుంటారు కదా. సాధ్యాసాధ్యాలను మీరు ఎలా నిర్ణయిస్తారు?
ముఖ్యంగా ముందుగా ఊహించిన బడ్జెట్, మరియు నిపుణుల సలహాలు, కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ గంగాధర్ గారు మరియు ఇతర నాయకత్వ సూచనలతో ఈ వ్యవహారం సాఫీగా సాగిపోతోంది.
 
ఇక్కడ సేకరింపబడ్డ నిధులతో ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? 
ఈ విషయం కాన్ఫరెన్స్ తదుపరి మిగులు నిధులు మరియు తానా బోర్డు ఆదేశాలతో ఇంతకుముందు లానే ఉపయోగించబడతాయి. తప్పకుండ తానా సేవ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందనేది చారిత్రక సత్యం
 
కోశాధికారి పదవి అన్నది కత్తి మీద సాములాంటిది.. ముఖ్యంగా ఇంత ఆర్భాటంగా జరుగుతున్న సభల్లో ఎన్నో కోపతాపాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని ఎలా మీరు సమన్వయపరచుకొంటున్నారు?
ముఖ్యంగా పదవి తీసుకున్నపుడే సమయం, సమన్వయము, కమిట్మెంట్ నిర్ణయించుకొన్నాను. అయితే ఊహకు మించి సహచరుల నుంచి సహకారం చాల సుఖదాయకంగా అనిపించింది. ఇకముందు కూడా ఎటువంటి సమస్యలు వస్తాయని అనుకోవడంలేదు.
 
ఈ సభల్లో జరగబోతున్న ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు తెలియజేయండి. 
మొదటిసారిగా అగ్రికల్చరల్ కమిటీ నిర్వహించడం, బిజినెస్ సెమినార్లో “ఫండ్ మీ” అనే ప్రోగ్రాం, అత్యున్నత కల్చరల్ ప్రోగ్రామ్స్‌తో పాటు అనేక ఇతర రంగాల కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉంటాయి.
 
ఒక్క మాటలో ఈ సభలకు ఎందుకు హాజరు కావాలో చెప్పండి. 
10 వేల మంది తెలుగు ప్రజలు ఒక్కచోట కలిసి విషయ సేకరణతోనూ, వివిధ ఆలోచనలతోను, కొత్త అవకాశాల పైన చర్చలతో పాటు గొప్ప వినోదాలను, విందులను  పొందడానికి మంచి అవకాశంగా తీసుకోవచ్చును అని చెప్పారు.