తానా వాలీబాల్ జాతీయ పోటిలలో విజేతలుగా ఫార్మింగ్టన్ ఫైటర్స్

TANA Volleyball
ivr| Last Modified బుధవారం, 10 జూన్ 2015 (21:26 IST)
20వ తానా మహాసభల సందర్భంగా నిర్వహించిన జాతీయ వాలీబాల్ పోటిలలో విన్నెర్స్‌గా ఫార్మింగ్టన్ ఫైటర్స్, చికాగో బాయ్స్ రన్నర్స్‌గా నిలిచారు. జూన్ 6వ తేదిన డిట్రాయిట్‌లో ఈ జాతీయ పోటీలు నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో ఈ రెండు టీమ్స్ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. వాలీబాల్ పోటిలలో MVPగా అబ్రహం ఎంపిక అయ్యారు. బాలికల విభాగంలో రెండు టీంలు, యువత మరియు అడల్ట్ టీమ్స్ ఆడడం పలువురను ఆకర్షించింది.
 
తానా మహాసభల కన్వీనర్ గంగాధర్ నాదెండ్ల విజేతలకు బహుమతులు అందచేసారు. విన్నెర్స్‌కు 750 డాలర్స్ నగదు బహుమతి, రన్నర్స్‌కు 500 డాలర్స్ నగదు బహుమతి, కప్ , క్రీడాకారులకు ట్రోఫీలు నిర్వాహకులు అందచేసారు. ఘనంగా జరిగిన బహుమతి ప్రదానంలో తానా మహాసభల కార్యదర్శి శ్రీనివాస్ గోగినేని, తానా మహాసభల కోశాధికారి నిరంజన్ శ్రుంగవరపు, తానా రీజినల్ కో-ఆర్డినేటర్ జోగేశ్వర రావు పెద్దబోయిన, తానా మహాసభల కోర్ కమిటీ సుభ్యులు రఘు రావిపాటి, సాగర్ మారం రెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు.
TANA Volleyball
 
20వ తానా మహా సభల సందర్భంగా నిర్వహించిన ఈ వాలీబాల్ పోటిలలో చికాగో, ఓహాయ్ఓ, కెనడా నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. తానా నిర్వహించిన జాతీయ క్రీడల పోటిలలో చివరి అంశంగా ఈ వాలీబాల్ పోటీలు క్రీడాభిమానులను ఆకట్టుకోవడం విశేషం. యువత మన వారసత్వసంపద అనే ధ్యేయం నెరవేరే విధంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి. 
TANA Volleyball
 
విజయ్ తూము తానా స్పోర్ట్స్ కమిటీ చైర్మెన్‌గా, వంశీ దేవాభక్తుని, చంద్ర అన్నవరపు కో-చైర్స్‌గా, రఘు రావిపాటి స్పోర్ట్స్ అడ్వైసర్‌గా, 20 మందికి పైగా కమిటీ కార్యవర్గ సభ్యులు సమన్వయంతో, సంఘటితంగా పనిచేసి ఈ పోటీలను విజయవంతం చేయడంలో విశేష కృషి చేసారు. తానా అధ్యకులు మోహన్ నన్నపనేని, సభల కన్వీనర్ గంగాధర్ నాదెండ్ల స్పోర్ట్స్ కమిటీ చేసిన కృషిని ప్రశంసించారు.దీనిపై మరింత చదవండి :