మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2016 (21:39 IST)

లండన్‌లో ప్రొ.జయశంకర్‌కు ఘన నివాళి...

తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ జయంతి వేడుకలను లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లండన్ నలుమూలల నుండి తెలంగాణవాదులు భారీగా పాల్గొన్నారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి, జయశంకర్

తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ జయంతి వేడుకలను లండన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లండన్ నలుమూలల నుండి తెలంగాణవాదులు భారీగా పాల్గొన్నారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి, జయశంకర్ ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
 
 
తరువాత సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ... తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి కొత్తపల్లి జయశంకర్. నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మలిదశ తెలంగాణ సాధన పోరాటం వరకూ ఆయన పాత్ర చిరస్మరణీయం. వారు చివరివరకూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసమే పనిచేశారని, అటువంటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయిన సంతోష సందర్భంలో ఆయన లేకపోవడం చాలా బాధాకరమన్నారు.
 
అనుకున్న ఆశయసాధనకై వారు చేసిన కృషి ప్రతివ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని, వారి జీవిత వృత్తాంతాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని, రాబోయే తరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రవాస తెలంగాణ సంఘాలన్నీ ఆచార్య మానసపుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.
 
ప్రొ.జయశంకర్ జయంతి వేడుకుల సందర్భంగా తెలంగాణ ఎన్నారై ఫోరంలో ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ మల్కాజిగిరి, నేరెడ్మెట్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. సంధ్య నాగుల అధ్యక్షతన రాబోయే రోజుల్లో సంస్థ చేయబోయే వివిధ కార్యక్రమాలను గురించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
 
TeNF ఫౌండర్ గంప వేణుగోపాల్, అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్, అడ్వైజరీ బోర్డు సభ్యులు గోలి తిరుపతి, ఈవెంట్స్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సుధాకర్ రంగుల, స్పోర్ట్ ఇంచార్జ్ నరేష్ మరియు ఎగ్జిక్యూటివ్ టీం సురేష్ బుడగం, రంగు వెంకట్, విక్రమ్ రెడ్డి, రాజ్ నాగుల మరియు ఇతర సభ్యులు వాణి అనుస్సూరి, జ్యోతి కాసర్ల, జయశ్రీ గంప, శౌరి మచ్చ, ప్రీతి నోముల పాల్గొన్నవారిలో ఉన్నారు.