దక్షిణ కాలిఫోర్నియాలో నారా లోకేష్ ప్రభంజనం

nara lokesh
ivr| Last Updated: సోమవారం, 4 మే 2015 (17:58 IST)
ఎన్నారై తెలుగుదేశం పార్టీ లాస్ ఏంజెలెస్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ నారా లోకేష్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నారా లోకేష్ ఇండియా నుండి బే ఏరియా చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో లాస్ ఏంజెలిస్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఎన్నారై టిడిపి లాస్ ఏంజెలెస్ ఆధ్వర్యంలో 100 కార్లతో ర్యాలీగా బయలుదేరి, షెరటాన్ సెర్రితోస్ చేరుకున్నారు.

తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మిత్రులు, సన్నిహితులు, స్నేహితులతో షెరటాన్ సెర్రితోస్ కిటకిటలాడింది. ఆదివారం సాయంత్రమని కూడా చూడకుండా, దక్షిణ కాలిఫోర్నియా నలుమూలల నుండి 600 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఆలపాటి రవి ప్రారంభోపన్యాసం చేస్తూ ఎన్టీఆర్ స్మృతులను నెమరేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే, నారా లోకేష్ ను సాదరంగా ఆహ్వానించారు.దీనిపై మరింత చదవండి :