గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 3 జూన్ 2017 (17:36 IST)

డల్లాస్‌లో తమ్మారెడ్డి అభిమానుల ఆత్మీయ సమావేశం

ప్రముఖ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అమెరికా పర్యటన సందర్భంగా డల్లాస్‌లో గుంటూరు ఎన్నారైల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్దత, పట్టుదలతో దేన్నయినా సాధించవచ్చని అన్నారు. అమెరికాలో

ప్రముఖ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అమెరికా పర్యటన సందర్భంగా డల్లాస్‌లో గుంటూరు ఎన్నారైల  ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్దత, పట్టుదలతో దేన్నయినా సాధించవచ్చని అన్నారు. అమెరికాలో ఉంటున్న తెలుగువారు అన్నిరంగాలలో రాణిస్తూ అభివృద్ధిలో ముందుండటం ఆనందంగా ఉందన్నారు. మాతృభూమికి సేవలందిస్తున్న ఎన్నారైలను ప్రత్యేకంగా అభినందించారు.
 
ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ తమ్మారెడ్డి ఆనాటి నుండి ఈనాటి వరకు సినీ పరిశ్రమలో వివాదాలకు అతీతంగా వుంటూ ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతూ కార్మికుల శ్రేయస్సుకు పాటుపడుతూ అందరికీ  ఆదర్శంగా నిలిచారన్నారు. తమ్మారెడ్డి సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు.
 
ఈ కార్యక్రమంలో వెంకట్ యలవర్తి, లక్ష్మి యలవర్తి, శ్రీనివాస్ కొమ్మినేని, పూర్ణ యలవర్తి, జనార్దన్ యెనికపాటి, సుమంత్ బొప్పన, శ్రీని మండవ, శ్రీకాంత్ పోలవరపు, రాము నార్నె, పూర్ణ పరుగుల, శివ కొమ్మినేని, వెంకటేశ్వరావు ఆరె, విజయ్ భార్గవ్ మందపాటి, జగదీష్ మోరంపూడి, హేమంత్ కోగంటి, సిద్దార్థ యలవర్తి, నాగార్జున యలవర్తి, క్రాంతికృష్ణ కొండబోలు, హర్ష గొట్టిపాటి తదితరులు పాల్గొన్నారు.