శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (12:31 IST)

మ‌న‌సు క‌వి ఆచార ఆత్రేయ శ‌త జ‌యంతి

Ateya family
ఆత్రేయ సినీక‌విగానే కాక ర‌చ‌యిత‌గా ముందు ప‌నిచేశారు. అయితే క‌విగా ఆయ‌న మ‌న‌సుక‌వి అని పేరు వ‌చ్చింది. ఎక్కువ భాగం మ‌న‌సుమీద పాటలు రాసేవారు. ఆత్రేయ అస‌లు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. ఆత్రేయ 1921 మే 7న సూళ్ళూరు మంగ‌ళంపాడు గ్రామంలో జ‌న్మించారు.  (1950)  దీక్షా సినిమాలో గీత ర‌చ‌యిత‌గా మ‌న‌సు క‌విగా పేరుపొందాడు. నేడు ఆయ‌న శ‌త జ‌యంతి. అందుకే అప్ప‌టి ఆయ‌న మాట‌లు, ప‌దాలు, మ‌న‌సుపై రాసిన క‌విత‌లు, జీవితాన్ని వ‌డ‌బోసిన సాహిత్యం ఆయ‌న క‌లం నుంచి జాలువారాయి. అవి ఓసారి ప‌రిశీలిద్దాం.
 
చిన్న‌త‌నంలోనే ప‌ద్యాలు
ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి 'ప్రవర్తనస‌, 'ఎన్.జి.వో' నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు.
 
ఇక‌ ప్రేమ్ నగర్ సినిమాకు రాసిన మాటలు. నిలకడ కోసం, ఏ మాత్రం నిలకడ లేని వా దగ్గర కొచ్చారా! అపి సంద‌ర్భోచితంగా రాశాడు. అలాగే అధికారం ద‌ర్పం చూపిస్తున్న వ్య‌క్తితో... ఇక్కడ నుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్థలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు అటూ రాశారు.
 
Athreya
తెలుగు అచ్చుల‌పై పాట‌
ఇక పాట‌ల‌ప‌రంగా చూస్తే, తెల్ల‌చీర క‌ట్టుకుంది ఎవ‌రికోసం మ‌లెల్పూలూ పెట్టుకుంది ఎవ‌రికోసం.. 
తెల్ల‌చీర క‌ట్టినా మ‌ల్లెపూలు పెట్టినా. క‌ళ్ల క‌ప‌టం ఎరుగ‌ని మ‌న‌సుకోసం. అంటూ సాహిత్య ప‌దాలు ఎక్క‌డా అస‌భ్య‌త‌కు తావులేకుండా వుండేవి. అదేవిధంగా `నేనంటే నువ్వంటూ రాయాలి.. అ ఆ.. ఇ.ఈ.. ఉ..ఊ ఎ.ఏ..` అంటూ తెలుగు అచ్చుల‌పై పాట‌కూడా రాసి ఔరా అనిపించారు. ఇక దేవుడిని కూడా ప్ర‌శ్నించేలా వేడుకునే శైలిలో రాసిన `శేష‌సైల వాసా.. శ్రీ వెంక‌టేశా.. శ‌య‌నించుమా అయ్యా..  శ్రీ‌దేవి వంక‌కు చిలిపిగా చూడ‌కు. అలివేలు మంగ‌కు అలుక రానీయ‌కు.అంటూ విన్న‌వించే పాట‌ను అద్భుతంగా మ‌లిచారు. దీనిని ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావుపై చిత్రీక‌రించారు.
 
ఆత్రేయ పాటలు గురించి
'దీక్ష' (1950) చిత్రానికి తొలిసారి అతను పాటలు రాశారు. "పోరా బాబు పో.." అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్‌ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. దాదాపు అన్ని పాట‌లు క‌లిపి 1400దాకా వుంటాయి.  'అంతులేని కథ'లో 'కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు.. ఆక‌లిరాజ్యంలో `ఆవేశం ఆపుకోలేని అమ్మానాన్న‌ల‌దే త‌ప్పా` అంటూ ప‌లికించాడు. స్వాతిముత్యం'లో 'చిన్నారి పొన్నారి కిట్టయ్య..అని ప‌లికించాడు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను 'మనసు కవి'గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. 
 
అయితే మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాటని ఆత్రేయనే రాసారని అప్ప‌ట్లో అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీ. అలాగే "కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన" పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
 
గొప్ప వేదాంతి
ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. "వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి" అని ఆత్రేయ అంటారు.  అటువంటి ఆత్రేయ 1989 సెప్టెంబ‌ర్ 13న అనారోగ్యంతో హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు.
.