మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (10:15 IST)

భాద్రపద ఏకాదశి.. శ్రీహరిని పూజిస్తే.. శుభవార్తలు వింటారు..

Ekadasi
భాద్రపద శుక్ల ఏకాదశి నేడు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే మహావిష్ణువు భాద్రపద శుక్ల ఏకాదశి నాడు పక్కకు తిరుగుతాడు. అంటే ఇది పరివర్తన. ఈ రోజున శ్రీహరిని పూజించడం వల్ల వ్యక్తుల్లో పరివర్తన చోటుచేసుకోవడమే కాదు, అత్యంత ప్రయోజనం కలుగుతుంది. 
 
ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ఈ ఏకాదశి నాడు శ్రీహరిని పూజిస్తే తీరని కోరికలు నెరవేరతాయని పురాణాలు చెప్తున్నాయి. 
 
భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు పసుపు వస్త్రంతోపాటు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరతాయి. విష్ణువుతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. నిరుపేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్తవుతాయి.
 
ఇకపోతే.. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కోంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ కాలంలోనే చాతుర్మాస దీక్షను చేపడతారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో ఈ దీక్ష సాగుతుంది.