లేత తమలపాకుల హారం.. ఆంజనేయునికి వేస్తే..?
ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. లేత తమలపాకుల హారాన్ని వేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. వారు బాగా ఎదుగుతారు.
వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్నివేసి.. తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది.
స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
మంగళవారం సుందరకాండ పారాయణం చేసి తమలపాకుల హారాన్ని వేస్తే అన్నీ కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది. తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది.
తమలపాకులతో మాలను వేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి పర్ణ ప్రసాదమని పేరు అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.