1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (16:19 IST)

భైరవుడిని అష్టమి రోజున పూజిస్తే..? రామగిరికి వెళ్తే..?

kala bhairava homam
శివుని అంశమైన భైరవుడిని స్వర్ణాకర్షణ భైరవ, యోగ భైరవ, ఆది భైరవ, కాల భైరవ, ఉగ్ర భైరవుడని  పిలుస్తారు. కాల భైరవ శివుని రుద్ర రూపంగా భావిస్తారు. శివాలయం ఈశాన్య భాగంలో ఈయన కొలువై వుంటాడు. కాల భైరవుడు శని, గురువు, పన్నెండు రాశులు, ఎనిమిది దిక్కులు, పంచభూతాలు, నవగ్రహాలు, కాలానికి అధిదేవతగా నిలుస్తాడు. 
 
కాలాగ్నిని శివుడు భైరవ మూర్తిగా మార్చాడు. ఎనిమిది దిక్కుల చీకటిని తొలగించేందుకు అష్ట భైరవులు దర్శనమిచ్చారని పురాణాలు చెబుతున్నాయి. భైరవుడిని పూజిస్తే సకల గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యా లు పెంపొందుతాయి.
 
ఈ రోజున రామగిరిని సందర్శించుకోవడం మంచిది. ఈ ఆలయం ఏపీలోని తిరుపతి జిల్లాలో వుంది.
 
ఈ ఆలయంలో 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరివుంటాయి. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో వుంటుంది.