భైరవి జయంతి : ఈతి బాధల నుంచి విముక్తి కోసం..
భైరవి జయంతి నేడు. భైరవి దేవి కాళీదేవికి దగ్గరి పోలికను కలిగివుంటుంది. ఆమె ఖడ్గం, రాక్షసుడి శిరచ్ఛేదం, అభయ ముద్రతో నాలుగు చేతులతో దేవతగా దర్శనమిస్తుంది.
మరొక రూపంలో, భైరవి దేవి పదివేల సూర్యుల తేజస్సుతో ప్రకాశించే పార్వతీ దేవి ప్రతిరూపంగా కనిపిస్తుంది. రెండు చేతులలో పుస్తకం, జపమాల పట్టుకుని వుంటుంది. ఆమె మిగిలిన రెండు చేతులతో అభయ ముద్ర, వరముద్రను కలిగివుంది.
మాఘ పూర్ణిమ రోజున వచ్చే త్రిపుర భైరవి జయంతి రోజున, అకాల మరణ బాధలు, దీర్ఘకాలిక నయం చేయలేని వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఆమెను ఆరాధించడం ద్వారా, జ్ఞానం, ఈతి బాధల నుంచి విముక్తి లభిస్తుంది.