శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (09:01 IST)

03-05-2019 శుక్రవారం మీ రాశి ఫలితాలు- నూతన ప్రదేశాల సందర్శనలో...

మేషం: నూతన ప్రదేశాల సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం తప్పదు. స్త్రీలు షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. 
 
వృషభం: దంపతుల మధ్య విబేధాలు, చికాకులు వంటివి తలెత్తుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి తోటివారితో లౌక్యం అవసరం. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. 
 
మిథునం: రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. మెళకువ వహించండి. ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వస్త్ర, బేకరి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కొంతమంది మీ నుండి ధనసహాయం అర్థిస్తారు. 
 
కర్కాటకం: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చురుకుగా సాగటంతో ఒకింత మనశ్శాంతి పొందుతారు. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. మీ కళత్ర వైఖిరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
 
సింహం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, వ్యాపారులకు కలిసిరాగలదు. హోదాలు, పదవీయోగాలు దక్కే సూచనలు వున్నాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరుల ముందు మీ కుటుంబ సమస్యలు ఏకరువు పెట్టడం మంచిది కాదని గ్రహించండి. పాతమిత్రుల కలయికతో సంతృప్తికాన వస్తుంది. 
 
కన్య: ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన కాలం. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తత అవసరం. ఒక కార్యం నిమిత్తం దూర ప్రాంతానికి ప్రయాణం చేయాల్సి వుంటుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల: నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రముఖుల కలయికతో పనులు సానుకూలమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తుల నిర్లక్ష్య ధోరణి వల్ల పై అధికారులతో మాటపడక తప్పదు. 
 
వృశ్చికం: సంఘంలో మీకు పేరు, ప్రఖ్యాతులు పెరుగును. ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలుంటాయి. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. 
 
ధనస్సు : మీ వాక్‌చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు.
 
మకరం: ఉద్యోగస్తులు అధికారుల విషయంలో అప్రమత్తంగా వ్యవహించవలసి వుంటుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి వుంటుంది. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. 
 
కుంభం : స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. ఏకాగ్రతతో కృషి చేసిన మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శనాలలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు. వస్త్ర, కళంకారీ,  పీచు, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసివచ్చే కాలం.
 
మీనం: ఉద్యోగస్థులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. అప్పుడప్పుడు ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. టెక్నికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగంలోని వారికి శుభదాయకం. ప్రైవేట్ సంస్థల్లో వారు మార్పునకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.