బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 6 మే 2018 (09:06 IST)

ఆదివారం (06-05-18) దినఫలాలు : చెక్కుల జారీలో తస్మాత్....

మేషం: స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుంచి విమర్శలు తప్పవు. వ్యాపార వర్గాల వారు చెక్కుల జారీ, ఖాతాదారులు, పనివారలతో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తుల

మేషం: స్త్రీలకు ఇరుగుపొరుగు వారి నుంచి విమర్శలు తప్పవు. వ్యాపార వర్గాల వారు చెక్కుల జారీ, ఖాతాదారులు, పనివారలతో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. 
 
వృషభం: ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకేస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మిధునం: ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. పెంపుడు జంతువుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ప్రైవేటు సంస్ధలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. స్త్రీల తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఎ.సి. కూలర్లు మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవచ్చును.
 
కర్కాటకం: ధనవ్యయం అధికంగా ఉన్నా సార్థకత ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. వస్త్ర వ్యాపారాలు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రావలసిన పత్రాలు, రసీదులు చేతికందుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
సింహం: వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించటంతో పాటు అనుభవం గడిస్తారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఎలక్ట్రానిక్, ఏసీ. రంగాల్లోవారికి కలిసి రాగలదు. తరచు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 
 
కన్య: విదేశీయాన యత్నాలు ఒక కొలిక్కిరాగలవు. కొంత ఆలస్యము అయినా పనులు పూర్తికాగలవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. బంధు మిత్రులతో ప్రయాణాలు సాగుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
తుల: ఆర్ధిక లావాదేవీల్లో పెద్దల సహకారం లభిస్తుంది. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. 
 
వృశ్చికం: స్ధిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా పడతాయి. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. హోటల్ తినుబండ, క్యాటంరింగ్ రంగాలలో వారికి కలిసివచ్చే కాలం. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడితప్పదు. అధికారులు ఒత్తిడి, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. రాజకీయాల్లో వారికి ప్రత్యుర్థులతో అప్రమత్తత అవసరం.
 
ధనస్సు: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులెదుర్కుంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. పెద్దమెుత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. 
 
మకరం:  వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. సహోద్యోగుల కారణంగా మాటపడవలసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. కొన్ని పనులు విసుగు కలిగించినా మెుండిగా పూర్తిచేస్తారు. 
 
కుంభం: ప్రేమికులకు పెద్దలతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల అస్వస్థతకు గురవుతారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి చికాకులు తప్పువు. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మీనం: పోస్టల్, కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు.