మంగళవారం, 28 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (07:25 IST)

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 08-10-17

మేషం : ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలలో మాటపడాల్సి వస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ఖర్చులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతనపట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణాలల

మేషం : ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్థాపం కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలలో మాటపడాల్సి వస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ఖర్చులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతనపట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణాలలో మరమ్మత్తులు చేస్తారు. స్త్రీలకు పనిలో ఒత్తిడి, పనిభారం తప్పదు. దూరప్రయాణాలలో చికాకులు, ఇబ్బందులు తప్పవు.
 
వృషభం : పెట్టుబడులు, కొత్త రుణాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటను అనుకూలిస్తాయి. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. నూనత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయి.
 
మిథునం : వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. శ్రమపడ్డా ఫలితం దక్కించుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన సమయం. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
కర్కాటకం : సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖుల సలహాలతో ముందుకు సాగుతారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యుత్, ఏసీ, కూలర్, మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గృహంలో సందడి కానవస్తుంది. ఆలోచనలు అమల్లో పెడతారు.
 
సింహం : ముఖ్యంగా కుటుంబంలో కలహాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అదనపు బాధ్యతలతో అలసిపోతారు. వ్యాపారస్తులు భాగస్వామ్య ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయకండి. మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరదు.
 
కన్య : నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. నిర్మాణ పథకాలలో మెలకువ వహించండి. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బదిలీలు, మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి.
 
తుల : ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలలో విజయం పొందేందుకు మరికాస్త కృషి చేయాలి. నిబద్ధతతో పనిచేస్తే అంతా విజయమే. స్త్రీలకు అధిక శ్రమ, దూరదేశాలు వెళ్ళేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి కానరాగలదు. ఐరన్, సిమెంట్, ఇసుక, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
వృశ్చికం : ఉమ్మడి కుటుంబ విషయాలలో మాటపడాల్సి వస్తుంది. చల్లని పానీయాల పట్ల ఆసక్తి చూపుతారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది.
 
ధనస్సు : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. రిప్రజెంటేటివ్‌లు, పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగస్తులకు స్థానమార్పిడికి ఆస్కారం ఉంది. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, పనిభారం తప్పవు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, సుగంధ ద్రవ్య, వ్యాపారులకు అభివృద్ధి కానవస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది.
 
మకరం : ట్రాన్స్‌ఫోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పెద్దలతో వాదోపవాదాలకు దిగవద్దు. సినిమా, కళా రంగాల్లోని వారికి ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. కొంతమంది మిమ్మల్ని ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి.
 
కుంభం : కుటుంబ సమస్యలు, ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. లీజు, ఏజెన్సీ, ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించిన చికాకులు తప్పవు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలసిరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు.
 
మీనం : నూతన పరిచయాలు, వ్యాపకాలు కొత్త ఉత్సాహం కలిగిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి, తగు ప్రోత్సహం లభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. దూర ప్రయాణంలో ఒత్తిడి, చికాకు తప్పదు. ఊహించని ఖర్చులు అధికం అవుతాయి. విశ్రాంతి లభిస్తుంది. చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెట్టండి.