శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (13:51 IST)

అక్టోబర్ 23న ధన్ తేరాస్.. అప్పు మాత్రం చేయకండి...

కార్తీక మాసం కృష్ణ పక్షం మొదటి రోజు ధన్ తేరాస్.. ఈ సంవత్సరం అక్టోబర్ 23 న జరుపుకుంటారు. ధన్ తేరాస్ మహాపర్వ దినం రోజున లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. అంతేకాదు సంపదకు దేవుడు అయిన కుబేరునితో పాటు.. ఆరోగ్యానికి అధిపతి అయిన ధన్వంతరిని ప్రత్యేకంగా పూజిస్తారు. సనాతన సంప్రదాయంలో ఈ రోజున బంగారం, వెండి వస్తువులు, పాత్రలు, కొత్త వాహనం కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ధన్వంతరి భగవానుడు ధన్ తేరాస్ రోజున జన్మించాడని నమ్ముతారు. 
 
అటువంటి పరిస్థితిలో, ఈ రోజున ఆయన ఆశీర్వాదం పొందడానికి, ఆయనను ప్రత్యేకంగా పూజించాలి.  ధన్‌తేరస్ రోజున డబ్బుల లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దని.. డబ్బు ఇవ్వకూడదని నమ్ముతారు. అలాగని మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్నా.. తీసుకోవాలనుకున్నా.. అది ముందుగా చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.