శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (13:41 IST)

బల్లి దేహంపై పడి పరుగులు పెడితే..?

బల్లి దేహంపై పడి పరుగులు పెడితే దీర్ఘాయువు చేకూరుతుందని బల్లిశాస్త్రం చెప్తోంది. బల్లి మీద పడి వెను వెంటనే దానంతట అది వెళిపోతే.. మంచే జరుగుతుంది. మెడ మీద బల్లిపడితే.. సంతాన ప్రాప్తి వుంటుంది. కుడి భుజ

బల్లి దేహంపై పడి పరుగులు పెడితే దీర్ఘాయువు చేకూరుతుందని బల్లిశాస్త్రం చెప్తోంది. బల్లి మీద పడి వెను వెంటనే దానంతట అది వెళిపోతే.. మంచే జరుగుతుంది. మెడ మీద బల్లిపడితే.. సంతాన ప్రాప్తి వుంటుంది. కుడి భుజంపై పడితే ఆరోగ్యం, ఎడమ భుజంపై పడికే స్త్రీ సంభోగం, ఆరోగ్యం వుంటుంది. కుడి ముంజేయిపై పడితే కీర్తి లభిస్తుంది. 
 
కానీ ఎడమ ముంజేయిపై పడితే అనారోగ్య సమస్యలు తప్పవు. హస్తంపై పడితే ధన లాభం చేకూరుతుంది. కానీ చేతిగోళ్లపై పడితే మాత్రం ధన నాశనమవుతుంది. స్తన భాగం‌పై పడితే దోషం చేకూరుతుంది. రొమ్ము, నాభి స్థానంపై బల్లిపడితే ధన లాభం వుంటుంది. కనుబొమ్మల నడుమ పడితే రాజ భోగము చేకూరుతుంది. శిరస్సుపై పడితే కలహం తప్పదు. దవడలు, మెడపై పడితే వస్త్ర లాభం లభిస్తుంది.