బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: శుక్రవారం, 24 మార్చి 2017 (19:53 IST)

అమ్మాయిలు ఇలా చేస్తే మంచి మొగుడు వస్తాడట...!

పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది. శుచీశుభ్రతతో నిత్యం దీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారట. దీపారాధన ఫలం వల్ల సద్భుద్ది, చూడచక్కని రూపం, జ్ఞానం లభిస్తాయని జ్యోతిష్యులు అం

పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది. శుచీశుభ్రతతో నిత్యం దీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారట. దీపారాధన ఫలం వల్ల సద్భుద్ది, చూడచక్కని రూపం, జ్ఞానం లభిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. సుమంగళీ మహిళలు తమ ఇష్టదైవాన్ని ప్రతిరోజూ దీపారాధన చేసి పూజిస్తే పుణ్యలోకాలు చేరుకుంటారని పండితులు అంటున్నారు. 
 
శక్తిస్వరూపిణి అయిన జ్యోతిని వెలిగించే అర్హత, భాగ్యం, స్త్రీలకే లభించింది. నిత్య దీపారాధన చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా దీపారాధన చేసే స్త్రీల భర్తలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారట. నిత్యదీపారాధన చేస్తే అట్టి స్త్రీల పాతివ్రత్యం లోకప్రసిద్ధం అవుతుందని వేదాలు చెప్తున్నాయి.