శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (18:18 IST)

శివాలయానికి వెళ్తే.. ఇలా చేయాలి..?

సాధారణంగా దేవతలను శాస్త్రోక్తంగా పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే శివాలయానికి వెళ్ళే సమయంలో శివుడిని ఎలా పూజించాలనే నియమం వుంది. సాధారణంగా శివుని ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తొలుత ''శివాయ నమః'' అనే మంత్రాన్ని ఉచ్ఛరించి.. రాజగోపురాన్ని తొలుత దర్శనం చేయాలి. ఆపై ఆలయం లోపలకి ప్రవేశించి విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. 
 
వినాయక పూజ తర్వాత నందీశ్వరుడిని స్తుతించాలి. నందీశ్వరుడిని దర్శించి.. నందీశ్వరా.. శివపరమాత్మను దర్శించేందుకు వచ్చాను. అనుమతి ఇవ్వాలని కోరాలి. ఆ సమయంలో నంది గాయత్రి మంత్రాన్ని జపించాలి. 
 
ఇక శివ దర్శనం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వుచ్చరించి స్తుతించడం మేలు. అటు పిమ్మట పార్వతీదేవిని, దక్షిణామూర్తిని దర్శించుకోవాలి. ఇవన్నీ పూర్తయ్యాక మూడు, ఐదు, ఏడుసార్లు ఆలయ ప్రదక్షణ చేయాలి. ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమఃశ్శివాయ అనే మంత్రాన్ని ఉచ్ఛరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.