బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2024 (21:17 IST)

శనిగ్రహ ప్రభావం తగ్గాలంటే.. రెస్ట్ రూమ్‌ని క్లీన్ చేయాల్సిందేనట..!

Lord Shani
జాతకాన్ని విశ్వసించని భారతీయులంటూ వుండరు. ముఖ్యంగా నవగ్రహాల కదలికల ఆధారంగా జీవిత పరిణామాలు వుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటుంటారు. అలాగే శనిగ్రహ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుంటూ వుంటారు. ఇంకా రాహు-కేతు దోషాల కోసం ప్రత్యేక ఆలయాలను సందర్శిస్తుంటారు. 
 
సాధారణంగా వినబడే కొన్ని పదాలు ఏలినాటి శని, అష్టమ శని కోసం ప్రత్యేక శనీశ్వర ఆలయాలను సందర్శించడం, శనికి అభిషేక ఆరాధనలు చేయడం వినివుంటాం. శనిగ్రహ ప్రభావంతో ఏర్పడే సమస్యలను దూరం చేసుకోవాలంటే.. రెస్ట్ రూమ్‌ల నుంచి ఇంటిల్లిపాదిని, కార్యాలయ స్థలాన్ని శుభ్రంగా వుంచుకునే వ్యక్తి శని గ్రహ బాధలు, అష్టమ, ఏలినాటి శని ప్రభావాన్ని చాలామటుకు తప్పిస్తాడని జ్యోతిష్యులు చెప్తున్నారు. అష్టమ, ఏలినాటి శని నడుస్తున్న వారు మహిళలు, పురుషులైనా ముందు రెస్ట్ రూమ్‌ను క్లీన్‌ చేయడంలో, ఇంటిని శుభ్రపరచడంలో ముందుండాలి. 
 
శనిదశ దుష్ప్రభావాలను అధిగమించడానికి శుభ్రతలో పాలుపంచుకోవడం, కష్టపడి పనిచేయడం చేయాలి. మనం నివసించే ప్రదేశం పరిశుభ్రంగా వుంటే మనస్సులో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తాయని పలు అధ్యయనాల ద్వారా నిరూపించాయి. సోమరితనాన్ని వీడితే శని గ్రహ ప్రభావాన్ని చాలామటుకు తప్పించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.