శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (16:43 IST)

01-07-2019 నుంచి 31-07-2019 మీ మాస ఫలితాలు

మేషరాశి : అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. 
అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనలాభం ఉంది. కొన్ని సమస్యలు తీరుతాయి. గృహంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. మానసికంగా కుదుటపడుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విదేశీ చదువులపై దృష్టి పెడతారు. పెట్టుబడులకు సమయం కాదు. ఆరోగ్యం సంతృప్తికరం. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. ఆధ్యాత్మికపట్ల ఆసక్తి నెలకొంటుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభనష్టాల సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. సంప్రదింపులు ఫలిస్తాయి. పరిస్థితులు అనుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీ శ్రీమతి ఆరగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
ఈ మాసం ప్రథమార్థం ఆశాజనకం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, ఒత్తిళ్ళకు పోవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. సంతానానికి నిదానంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు మున్ముందు ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
కర్కాకట రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష. 
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ధనంమితంగా వ్యయం చేయండి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలుంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. సమర్థతకు ఏమంత గుర్తింపు లభించదు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. విలువైన వస్తువులు, నగదు పట్ల జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తి ఉపాధి పథకాల సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రయాణం తలపెడతారు. 
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఈ మాసం యోగదాయకమే. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలత ఉంది. వ్యతిరేకుల సన్నిహితులవుతారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ధనలాభం ఉంది. ఖర్చులు సంతృప్తికరం. చెల్లింపుల్లో జాగ్రత్త. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధుత్వాలు బలపడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆధ్యాత్మిక సంస్థలకు సాయం అందిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారులకు హోదామార్పు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వేదుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు ధనం అందుతుంది. పెట్టుబడులకు తరుణం కాదు. మాటతీరుతో ఆకట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. గృహంలో ప్రశాంత నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం ఆలస్యంగా లభిస్తుంది. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. రవాణా రంగాలవారికి పురోభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికరాశి : విశాక 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట. 
ఈ మాసం ప్రథమార్థం ప్రతికూలతలే అధికం. ఆదాయానికి మించిన ఖర్చులు. రుణ ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు. ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పనులు అర్థాంతరంగా నిలిపివేయవలసి వస్తుంది. ఆప్తుల సాయం అందుతుంది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయంలో మెళకువ వహించండి. దళారులను విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం విషయంలో శుభపరిణామాలుంటాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. సేవా, సాంకేతిక రంగాల వారికి అశాజనకం. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ప్రతికూలతలు అధికం. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. చేతిలో ధనం నిలువదు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. చీటికిమాటికి అసహనం పెరుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దంపతుల మధ్య అవగాహనా లోపం. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆప్తుల సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నగదు, పత్రాలు జాగ్రత్త. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. 
 
మకర రాశి : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టిపెడతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. సంప్రదింపులు ఓ కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ శ్రీమతి సలహా కలిసివస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వేడుకలకు సన్నాహాలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణం తలపెడతారు. వాహనం ఇతరులకు ఇవ్వొద్దు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఈ మాసం అనుకూలదాయకమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులపై దృష్టిపెడతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. వ్యవరానుకూలత ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధుత్వాలు బలపడతాయి. ఆధ్యాత్మికతపట్ల ఆసక్తి కలుగుతుంది. సంతానానికి త్వరలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి. 
ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సమర్థతను చాటుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారాలు  స్వయంగా చూసుకోవాలి. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. గృహమార్పు కలిసివస్తుంది. పరిచయాలు బలపడతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు వేగవంతమవుతాయి. కొత్త ప్రదేశాలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.