సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (14:34 IST)

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే.. భైరవుడి విభూతిని...?

spiritual
ఇంట సానుకూల శక్తి పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఒకరి ఇంట్లో సానుకూల శక్తులు నిలవాలంటే ఇంట్లోని స్త్రీలు ప్రతి శుక్రవారం ప్రధాన గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి గుమ్మానికి కుంకుమ పెట్టాలి. ఇలా చేయడం వల్ల సంపద చేరుతుంది. ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి నివాసం చేస్తుంది. 
 
పటిక రాయిని నల్ల తాడుకు కట్టి ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇంటి ముందు వినాయకుడి బొమ్మ లేదా గణేశ విగ్రహం ఉండటం వల్ల ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోయి ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
 
గణేశ విగ్రహానికి ప్రతిరోజూ పువ్వులు, ధూపం వేయడం ద్వారా ఆ ఇంట సుఖసంతోషాలు చేకూరుతాయి. శివాలయాల్లో భైరవుడికి అభిషేకం చేసిన విభూతిని కొనుగోలు చేసి, ఇంటి బయటి ద్వారానికి రెండు వైపులా కొద్దిగా ఉంచితే చెడు శక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.