మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By TJ
Last Modified: శుక్రవారం, 22 డిశెంబరు 2017 (20:17 IST)

2018 జనవరి 5న ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి..?

నూతన సంవత్సరం 2018 సోమవారం మొదలు కానుంది. జనవరి 5వ తేదీ శుక్రవారం వచ్చింది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. యేడాదిలో మొదటి శుక్రవారమిది. ఈ రోజు లక్ష్మీదేవికి వ్రతం చేస్తే ఆ యేడాది మొత్తం సుఖసంతోషాలు కలుగుతాయని ఆధ్మాత్మిక పండితులు చెబు

నూతన సంవత్సరం 2018 సోమవారం మొదలు కానుంది. జనవరి 5వ తేదీ శుక్రవారం వచ్చింది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. యేడాదిలో మొదటి శుక్రవారమిది. ఈ రోజు లక్ష్మీదేవికి వ్రతం చేస్తే ఆ యేడాది మొత్తం సుఖసంతోషాలు కలుగుతాయని ఆధ్మాత్మిక పండితులు చెబుతున్నారు. మొదటి శుక్రవారం వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అంతేకాదు ఆరోజు నుంచి మొదలుకుని 21 రోజులు వ్రతం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతున్నారు.
 
శుక్రవారం ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అమ్మవారి అష్టోత్తరాలు చదవాలి. ఆ తరువాత అమ్మవారిని పాలతో చేసిన నైవేద్యం సమర్పించాలి. అంతేకాదు గోమాతను కూడా పూజించాలి. వ్రతం ముగింపు సమయంలో మహాలక్ష్మిని గన్నేరు పువ్వులతో అభిషేకం చేయాలి. తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులతో పూజించాలి. ఆ తరువాత అమ్మవారి వద్ద దగ్గర ఉన్న ప్రసాదాలను ఇంటిలోని కుటుంబ సభ్యులకు పంచి పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లోని కష్టాలన్నీ తొలగిపోతాయి.