శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (17:52 IST)

2018లో సింహ రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయంటే?

సింహ రాశి: మఘ 1, 2, 3, 4 పాదములు (మా, మీ, మూ, మే) పుబ్బ 1, 2, 3, 4 పాదాలు (మో, టా, టీ, టు) ఉత్తర 1వ పాదములు (టే). ఆదాయం-11, వ్యయం-11, పూజ్యత-3, అవమానం-6. ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు తృతీయము నందు బృహస్పతి, ఆ తదుపరి చతుర్థము నందు, ఈ సంవత్సరం

సింహ రాశి: మఘ 1, 2, 3, 4 పాదములు (మా, మీ, మూ, మే) పుబ్బ 1, 2, 3, 4 పాదాలు (మో, టా, టీ, టు) ఉత్తర 1వ పాదములు (టే). ఆదాయం-11, వ్యయం-11, పూజ్యత-3, అవమానం-6. 
 
ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు తృతీయము నందు బృహస్పతి, ఆ తదుపరి చతుర్థము నందు, ఈ సంవత్సరం అంతా, పంచమము నందు శని, ఈ సంవత్సరం అంతా వ్యయము నందు రాహువు, షష్ఠమము నందు కేతువు సంచరిస్తారు. 
 
ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలించగా ''పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు' ఇతరుల విషయాలకు దూరంగా ఉండి మీ పనులు చక్కబెట్టుకోవడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. గ్రహసంచారం అనుకూల స్థితి తక్కువగానే ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సహకారం, వృత్తి విషయాల్లో అధికారుల ప్రోత్సాహంతో ముందుకు సాగి విజయాలు మీ సొంతం చేసుకుంటారు. అన్ని వ్యవహారాలు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా చేసుకోవడం ఉత్తమం. గురు సంచారం అనుకూలం తక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు. 
 
ప్రతిపనీ విశేషమైన శ్రమతో పూర్తవుతుంది. మితసంభాషణతో మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం మంచిది. శని, రాహువుల అనుకూలం కూడా తక్కువగా వుందనే చెప్పవచ్చు. రుణ సంబంధంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధిక కృషితో స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కొంతవరకు అనుకూలించగలవు. అధిక కాలం కుజగ్ర సంచారం అనుకూలం వల్ల మంచి ఫలితాలు అందుకోవడం, శ్రమచేయు లక్షణాలు అధికంగా ఉంటాయి. అవివాహితులకు శుభ తరుణం. అనుకున్న సంబంధాలు నిశ్చయం కాగలవు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మానసిక ప్రశాంతత,  ముఖ్యులతో పరిచయాల వల్ల కొంత మార్పు కలుగుతుంది. 
 
వ్యయ రాహువు ప్రభావంతో నేత్రబాధలు అధికంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ధనవ్యయం అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. విదేశీ పర్యటనల్లో మెళకువ అవసరం. దంపతుల మధ్య ప్రతి విషయం చర్చకు వస్తుంది. ఫ్యాన్సీ, కిరాణా రంగాల్లో వారికి సత్కాలం. అయితే ఈ సంవత్సరం మిగిలిన గ్రహాల సంచారం అనుకూలం దృష్ట్యా సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పడి సమస్యలు నుండి బయటపడతారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. 
 
కుజుడు ఆరవ ఇంటి స్తంభన కారణంగా వస్త్ర, ధన, ధాన్య లాభం చేకూర్చటం, కీర్తిప్రతిష్టలు పెరగడం వంటి శుభపరిణామాలు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంగా కానీ, వ్యవహారపరంగా గానీ కొంత ఇబ్బందులు తప్పవు. సంతాన విషయంలో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తుల విషయంలో ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు కానీ మానసిక అశాంతి ఎదుర్కొంటారు. తోటి ఉద్యోగస్తులతో మెళకువ అవసరం. చేపట్టిన ప్రతిపనిలోను ధైర్యంగా ముందుకు సాగుతారు. నిరుద్యోగులు నూతన ఉద్యోగయత్నాల్లో సఫలీకృతులౌతారు. 
 
అనుకున్న అవకాశాలను పొందగలుగుతారు. ప్రతిపని ఆచరణకు ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల విమర్శలు ఎదుర్కొంటారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యవసాయ రంగాల్లో వారు వాతావరణాన్ని బట్టి పనులు చేసుకుని నష్టాలు లేకుండా కాలక్షేపం చేస్తారు. అయితే అనుకున్నంత లాభాలు మాత్రం కనిపించవు. విద్యార్థులు దృష్టి ఇతర విషయాల మీద ఉండటం వల్ల సరైన ఫలితాలు పొందలేరు. తీవ్ర ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంది. షేర్ రంగాల్లో వారికి నష్టాలు అంటూ ఏమీ వుండవు. 
 
* ఈ రాశివారు ఆంజనేయుని తమలపాకులతో పూజించినట్లైతే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, అభివృద్ధి కానవస్తుంది.
 
* మఖనక్షత్రం వారు ''కృష్ణవైఢూర్యం'', పుబ్బ నక్షత్రం వారు "వజ్రం", ఉత్తర నక్షత్రం వారు "జాతికెంపు" ధరించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
* మఖ నక్షత్రం వారు "మర్రి" చెట్టును, పుబ్బ నక్షత్రం వారు "మోదుగ", ఉత్తరా నక్షత్రం వారు "జువ్వి" చెట్టును దేవాలయాల్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాల్లో నాటినా శుభం కలుగుతుంది.