శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 మే 2021 (15:38 IST)

పౌర్ణమికి రోజున ఇలా చేస్తే..? కుబేరుడికి ఊరగాయలంటే ప్రీతి తెలుసా?

పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. చేతినిండా డబ్బు సంపాదించినా పొదుపు చేయలేక బాధపడేవారు.. ఈ ఆధ్యాత్మిక చిట్కాలను పౌర్ణమి రోజున పాటిస్తే సరిపోతుంది. పౌర్ణమి రోజున లేదంటే మంగళ, శుక్రవారాల్లో డైమండ్ కలకండను ఇంటిలోని కామాక్షి దీపంలో వేసి దీపం వెలిగించడం చేస్తే శ్రీలక్ష్మీ కటాక్షం లభిస్తుంది. 
 
బుధ, గురు వారాల్లో పౌర్ణమి రోజున కుబేరుడిని స్తుతించి పూజిస్తే.. ఆదాయం ఇంట చేరుతుంది. ఊరగాయలు అంటే కుబేరుడికి ప్రీతి. అందుకే ఇంట్లో ఊరగాయలను నిల్వ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే ఆదాయం లభిస్తుంది. అలాగే ఇంటికి వచ్చే సుమంగళీ మహిళలకు నీటిని ఇవ్వటం, పసుపుకుంకుమలను ఇవ్వడం ద్వారా జన్మజన్మల పాపం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.