1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (14:05 IST)

అష్టమి రోజు సాయంత్రం గుమ్మడి దీపం ఎందుకు?

Pumpkin deepam
అష్టమి రోజున కాలభైరవునికి గుమ్మడి దీపం వెలిగించడం ద్వారా నరదృష్టి, శత్రుభయాలు, శనిదోషం, ఆర్థిక సమస్యలు వుండవు. ఇంకా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వుండదు. భక్తిశ్రద్ధలతో గుమ్మడి దీపాన్ని కాలభైరవునికి వెలిగించడం ద్వారా ఈతిబాధలుండవు. 
 
ఈ దీపారాధన ఎలా చేయాలంటే.. అష్టమి రోజున సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బూడిద గుమ్మడి కాయ దీపాన్ని వెలిగించాలి. ముందుగా గుమ్మడి కాయను మధ్యకు సమానంగా కోసి దానిలోని గుజ్జును, గింజలను తీసివేసి దానికి పసుపు కుంకుమ సమానంగా పెట్టి.. నువ్వుల నూనెను పోసి, పత్తితో వత్తిని వేసి వెలిగించాలి. దానికింద ఇత్తడి పళ్లెం వుంటే మంచిది. 
 
దీపారాధన సమయంలో తల్లిదండ్రులకు నమస్కరించి... గురువులకు నమస్కరిచాక వెలిగించాలి. గ్రామ, ఇంటి దేవతలను వేడుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, గంధం స్వామి ముందు వుంచి అగరవత్తులు వెలిగించి స్వామిని స్తుతించాలి. 
 
కాల భైరవ అష్టకాన్ని 11 సార్లు చదవాలి. ఈ దీపారాధన 19 అష్టమి తిథుల్లో కానీ లేదా 19 అమావాస్య తిథుల్లో చేస్తే మంచి ఫలితం వుంటుంది. ఈ పూజ చివరకు ఎండు ఖర్జూరాలను ప్రసాదంగా సమర్పిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ దీపారాధన ద్వారా చండీ హోమం చేసినంత ఫలితం లభిస్తుంది.