శుక్రవారం, మంగళవారం రాహుకాల పూజ.. కష్టాలే వుండవ్!
శుక్రవార పూజతో సకలసంపదలు చేకూరుతాయి. శుక్రవారం పూజ అన్నీ కార్యాల్లో విజయం సంపాదించి పెడుతుంది. ఆదిశక్తిని ఆరాధించడం... ఇంట.. దేవాలయంలో పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా దుర్గాదేవికి శుక్రవారం రాహుకాలంలో దీపం వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.
ఈ రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి అభిషేకం చేయించి.. మల్లెపువ్వులు, తామర పువ్వులతో పూజించడం చేయాలి. ప్రసాదంగా చక్కెర పొంగలి, శెనగలు, పాయసాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా 21 వారాలు చేయాలి. దీనివల్ల వ్యాపారాల్లో నష్టాలుండవు. అలాగే శుక్రవారాల్లో సుమంగళి పూజను వివాహిత స్త్రీలు చేయాలి.
మాంగల్య బలం కోసం ఈ పూజ చేయొచ్చు. అలా సుమంగళి పూజ చేయలేని వారు శుక్రవారం రాహుకాలంలో దుర్గాదేవికి పసుపు, పుష్పాలు, కుంకుమ, తమలపాకులు, మాంగల్యం సమర్పించాలి. కనీసం నెలకు ఒకసారి ఈ వ్రతం చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అలాగే మంగళవారం పూట వచ్చే రాహుకాలంలోనూ దుర్గమ్మను పూజించే వారి సర్వశుభాలు చేకూరుతాయి. గ్రహ స్థితి కారణంగా వివాహంలో అడ్డంకులు ఏర్పడే వారికి దుర్గమ్మకు పూజ అదీ మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దీపం వెలిగించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.
అందం, చదువు, హోదా, గౌరవం, పదవులు ఎన్ని ఉన్నా గ్రహభ్రమణం చోటు చేసుకోకపోతే యుక్త వయస్సులో వివాహం కేవలం మాటగా మారుతుంది.
పెళ్లికొడుకుల కోసం వెతుకుతున్న వారు, కారణం తెలియక వివాహంలో అడ్డంకులతో బాధపడేవారు ఈ మంగళ వార పూజ చేసుకోవచ్చు. మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవిని పూజించడం వల్ల వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి.