మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (14:15 IST)

మొక్కుబడిని నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుందో తెలుసా?

ఏదైనా చిన్నపాటి కష్టమొస్తే చాలు.. దేవాలయాల వెంట తిరగడం.. స్వామీ కష్టాన్ని తీర్చమని వేడుకుంటాం. అలా దేవుడి వద్ద మొరపెట్టుకునే కోరిక నెరవేరితే.. ఏదో చేస్తామని మొక్కుకుంటాం. ఆపద నుంచి బయటపడేందుకు, కోరిక

ఏదైనా చిన్నపాటి కష్టమొస్తే చాలు..  దేవాలయాల వెంట తిరగడం.. స్వామీ కష్టాన్ని తీర్చమని వేడుకుంటాం. అలా దేవుడి వద్ద మొరపెట్టుకునే కోరిక నెరవేరితే.. ఏదో చేస్తామని మొక్కుకుంటాం. ఆపద నుంచి బయటపడేందుకు, కోరిక కోరికలు నెరవేర్చాలని భక్తులు మొక్కుకుంటారు. అయితే ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆపద నుంచి గట్టెక్కిన తర్వాత చాలామంది దేవునికి మొక్కుకున్న విషయాన్ని మొక్కుబడిని మరిచిపోతారు. 
 
అయితే మొక్కిన మొక్కును మరిచిపోతే, నిర్లక్ష్యం చేస్తే.. భగవంతుడు శిక్షించడు. మొక్కులు తీర్చలేదని కష్టపెట్టడు. అయితే మొక్కుకున్న బాధ నుంచి ఎలా గట్టెక్కాం. ఆ కష్టాన్ని ఎలా అధిగమించామనే విషయాన్ని మళ్లీ జ్ఞప్తికి వచ్చేలా చేస్తాడు. భగవంతుడు ఎప్పుడు ధర్మం, సత్యంపై జీవితం గడపాలంటాడు. ఇచ్చిన మాటపై నిలబడమంటాడు. 
 
అలా మీరు మొక్కుకున్న మొక్కును విడిచిపెడితే, మరిచిపోతే.. అది మీ సమస్య అవుతుంది. అందుచేత ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడం ముఖ్యం. అది దేవుని మొక్కుబడిలోనే కాదు.. జీవిత మార్గంలోనూ ఇదే సత్యాన్ని పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.