సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (19:38 IST)

గురువారం శివ పంచాక్షరి మంత్రం.. ఆ దోషాలను తొలగిస్తుందట..

గురువారం పూట శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి. గురు గ్రహ దోషాలుంటే వివాహాలు ఆలస్యం కావడం వంటివి జరుగుతాయి. 


అలాగే కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు ఏర్పడుతాయి. 
 
అందువల్ల గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజున ధరించవచ్చు. అలాగే  శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి.
 
స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం వుంటే గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి.