శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (10:08 IST)

3 జనవరి 2019 మీ రాశి ఫలితాలు... సాయిబాబా గుడిలో వుండే దునిలో...

శ్రీ విళంబినామ సంవత్సర మార్గశిర మాసం త్రయోదశి. ఈ రోజు సాయిబాబా గుడిలో వుండే దునిలో రావి సమిధలను వేసిన శుభం కలుగుతుంది. 
 
మేషం: ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వటం క్షేమం కాదు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. చేపట్టిన పనుల్లో అవాంతరాలు, చికాకులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. కొత్త విషయాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులకు మీపై సదభిప్రాయం కలుగుతుంది. 
 
వృషభం: ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. దంపతుల మధ్య దాపరికం తగదు. సోదరీసోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మీ అభిప్రాయాలకు ఆశించిన స్పందన వస్తుంది. 
 
మిధునం: ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఏమరుపాటు వల్ల వస్తువులు చేజార్చుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వస్తారు. కోర్టు, ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. బంధుమిత్రుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. 

 
కర్కాటకం: స్త్రీలకు ఉద్యోగావకాశం లభిస్తుంది. భేషజాలకు పోయి విపరీతంగా వ్యయం చేస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతికి మరికొంత సమయం పడుతుంది. ఖర్చులు ప్రయోజనకరం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒప్పందాలు, చెల్లింపుల్లో ఆచితూచి వ్యవహరించండి. మీరంటే కిట్టని వ్యక్తులతో జాగ్రత్తగా వుండాలి.

సింహం: కొత్త స్కీముల అమలుతో వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రముఖుల ఇంటర్య్వూ కోసం పడిగాపులు కాస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా వుండాలి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. పత్రికా సిబ్బందికి చిన్నచిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం వుంది. వ్యవహార ఒప్పందాల్లో తొందరపడవద్దు. 
 
కన్య: కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు ఎదురవుతాయి. మీ శ్రీమతితో అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం వుంది. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో జాగ్రత్త అవసరం. స్త్రీల కోరికలు,అవసరాలు నెరవేరవు. ఓర్పుతో అన్నింటిని నెట్టుకొస్తారు. పొదుపు పథకాల ధనం ముందుగానే తీసుకుంటారు. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది. 
 
తుల: ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పనులు, కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. అధికారులకు తనిఖీలు, పర్యటనలు అధికమవుతాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం ముడుతుంది. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. 
 
వృశ్చికం: ఆర్థిక, కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. అవకాశాలు కలిసిరాక, యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. వేడుకలు, విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, లోన్లు మంజూరవుతాయి.
 
 
ధనస్సు: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లతో జాగ్రత్త వహించండి. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో మెళకువ అవసరం. మీ ప్రమేయంతో సమస్యలు పరిష్కారమవుతాయి. హామీలు, చెక్కులు జారీల్లో ఏకాగ్రత వహించండి. చిన్నారులకు విలువైన కానుకలు ఇస్తారు. ఆకస్మిక చెల్లింపులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. 
 
మకరం: చేతి వృత్తుల వారికి మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. బకాయిల వసూలలో సంయమనం పాటించండి. అధిక శ్రమ, నిద్రలేమి వల్ల అస్వస్థతకు గురవుతారు. లౌక్యంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. 
 
కుంభం: ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయడం మంచిది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లతో జాగ్రత్త. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సాన్నిహిత్యం నెలకొంటుంది. వాణిజ్య ఒప్పందాలు, చెల్లింపుల్లో జాగ్రత్త. తొందరపడి హామీలివ్వకండి. 
 
మీనం: వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు  కృషిలో ఆశాజనకమైన మార్పులుంటాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.