సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (15:35 IST)

మంగళవారం పూట ఆంజనేయ స్వామి సింధూరం తీసుకుని?

అవాంతరాల నుంచి గట్టెక్కించేందుకు అంజనీ పుత్రుడున్నాడు.. అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. మంగళవారం పూట ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి సింధూరం తీసుకుని.. ముఖానికి, చేతులకు, హృదయం మీద లేపనం చేయాలి. 
 
ఇలా చేశాక
''ఓం అంజనీ సుతాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి 
తన్నో మారుతి ప్రచోదయాత్'' అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఇలా చేస్తే అనుకోని అవాంతరాలు, సమస్యలు తొలగిపోతాయి.
 
అలాగే ఎవరైనా దూరపు ప్రయాణాలు చేస్తే.. యాత్రలకు వెళ్లాలనుకున్నప్పుడు ప్రమాదాల నుంచి బయటపడాలంటే... కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు తల మీద చల్లుకుని కొబ్బరిని ప్రసాదంగా పంచి.. వారూ కొబ్బరి తినాలి. ఇలా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే ఓ ఎర్రని వస్త్రంలో ఎనిమిది ఖర్జూర కాయలను వుంచి మూట కట్టి కొత్త వాహనానికి ఆ వస్త్రాన్ని కట్టడం ద్వారా వాహనపరంగా ఎలాంటి ప్రమాదాలు రాకుండా నివారించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.